తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం కోసం ఏర్పడినట్లుంది : సుష్మాస్వరాజ్‌

  • ఆయన కుటుంబ సభ్యులకు తప్ప మిగిలిన ఎవరికీ ఉద్యోగాల్లేవు
  • రాష్ట్రం కోసం బలైన యువతను గుర్తించే స్థితిలో కూడా కేసీఆర్‌ లేరు
  • 2 వేల మంది చనిపోతే 400 మందినే గుర్తించారన్నారు
తెలంగాణ సమాజం కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దాన్ని కేసీఆర్‌ తన కుటుంబ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆమె ఉదయం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ నిర్మాణం జరగాలంటే రాష్ట్ర ప్రజలు బీజేపీకి పగ్గాలు అందించాలని, అప్పుడే వారికి మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రం కోసం రెండు వేల మంది యువత బలిదానం చేస్తే కనీసం వారిని గుర్తించే స్థితిలో కూడా కేసీఆర్‌ ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. మొక్కుబడిగా 400 మందిని గుర్తించి చేతులు దులిపేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా ఒక్క ఉద్యోగం కల్పించే ప్రయత్నం జరగలేదని ఆరోపించారు.
Go Back to Shorts
susmaswaraj
TRS
election campaign

More Telugu News